తార్నాక డివిజనల్ ఆఫీస్ ప్రత్యేక ప్రచారం 5.0 ప్రారంభం
న్యూఢిల్లీలోని Food Corporation of India (FCI) ప్రధాన కార్యాలయం సూచనల మేరకు భారత ప్రభుత్వ పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (DARPG) ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్‌లోని తార్నాక(Tarnaka)లో ఉన్న భారత ఆహార సంస్థ (FCI) డివిజనల్ ఆఫీస్ (Divisional Office) అక్టోబర్ 2 నుంచి 31 వరకు ప్రత్యేక ప్రచారం(Special Promotion) 5.0ను ప్రారంభించింది. ఈ సందర్భంగా డివిజనల్ మేనేజర్ జగత్ రామ్ మాట్లాడుతూ.. “నెల రోజులు జరిగే ఈ ప్రచారం స్వచ్ఛతా డ్రైవ్‌లు, స్థల నిర్వహణ, రికార్డుల డిజిటలైజేషన్(Digitization of Records), పెండింగ్ విషయాల పరిష్కారంపై దృష్టి సారిస్తుందని చెప్పారు. ఇది ప్రభుత్వ స్వచ్ఛత, సమర్థవంతమైన పాలన దార్శనికతను పునరుద్ఘాటిస్తుందని అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఈ కార్యాలయం 17.09.2025 నుంచి 02.10.2025 వరకు తన పరిధిలోని డిపోల్లో స్వచ్ఛతా హి సేవను విజయవంతంగా నిర్వహించింది. అక్టోబర్ 2(గాంధీ జయంతి-Gandhi Jayanti)న ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా కార్యాలయ ప్రాంగణాలు, డిపోల్లో శుభ్రతా డ్రైవ్‌లు, పాత రికార్డుల తొలగింపు, ప్రజలకు అందుబాటులో ఉండే సౌకర్యాలను మెరుగుపరచడం వంటి వివిధ కార్యకలాపాలు చేపట్టాం. సిబ్బంది స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. పరిపాలనలో పరిశుభ్రత, పారదర్శకతకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ ప్రచార సమయంలో పెండింగ్‌లో ఉన్న సూచనలను పాటించాం. కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపరిచాం. పౌర-కేంద్రీకృత సేవా బట్వాడాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాం. ఇందులో తార్నాక డివిజనల్ ఆఫీస్ ఉద్యోగులు చురుగ్గా పాల్గొన్నారు. కార్యకలాపాల నిరంతర పర్యవేక్షణ ద్వారా స్పష్టమైన ఫలితాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
