Wednesday, January 14, 2026
EPAPER
Homeఅంతర్జాతీయంFIFA | మొత్తానికి ట్రంప్‌కు శాంతి బహుమతి

FIFA | మొత్తానికి ట్రంప్‌కు శాంతి బహుమతి

నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) కోసం ఎంతో ఆశపడ్డ అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)కి ఎట్టకేలకు ఒక పీస్ ప్రైజ్ వచ్చింది. తొలిసారిగా ఏర్పాటుచేసిన ఫిఫా శాంతి బహుమతి(FIFA Peace Award)ని ఆయనకు ప్రకటించారు. ఫిఫా అధ్యక్షుడు (FIFA President) గియాని ఇన్‌ఫాంటినో (Gianni Infantino) ఈ మేరకు ప్రకటన చేశారు. వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్‌లో జరిగిన ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ డ్రా కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి ట్రంప్ కూడా హాజరయ్యారు. ఫిఫా పీస్ అవార్డ్ కింద బంగారు పతకాన్ని స్వీకరించారు. ప్రపంచ శాంతికి ట్రంప్ ఎంతో పాటుపడ్డారని గియానీ ప్రశంసించారు. ఈ బహుమతి తనకు దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఒకటని ట్రంప్ సంతోషం వెలిబుచ్చారు. అయితే.. ఈ ప్రైజ్‌ను ఇలా ఏకపక్షంగా ప్రకటించటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News