మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే (Siddipet Mla) హరీష్‌రావు.. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth)పై ఫైర్ అయ్యారు. ‘ఎమన్నా అంటే పైసలు (Money) లేవు అంటవు. పథకాలకు (Schemes) డబ్బులు లేవు అంటవు. ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee reimbursement) అంటే డబ్బులు లేవు అంటవు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే డబ్బులు లేవు అంటవు. కానీ.. ఫ్యూచర్ సిటీ(Future City), మూసీ (Musi) శుద్ధికి లక్షల కోట్లు ఖర్చు పెడుతవ్. రెండేళ్లలో రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల అప్పు చేసి ఏం చేసినవ్ రేవంత్ రెడ్డి?. ఢిల్లీ(Delhi)కి మూటలు మోయడం తప్ప నువ్వు చేసింది ఏముంది?’ అని నిలదీశారు.
- Advertisement -
