Friday, September 12, 2025
ePaper
spot_img
Homeసినిమాఏపీ సీఎం చంద్రబాబును కలవనున్న సినీ పెద్దలు

ఏపీ సీఎం చంద్రబాబును కలవనున్న సినీ పెద్దలు

ఈ నెల 15న సాయంత్రం 4 గంటలకు సమావేశం

తెలుగు సినిమా పెద్దలు ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఈ మేరకు డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 15న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరగనుంది. టాలీవుడ్‌ను డెవలప్ చేయటం, ఇండస్ట్రీలోని సమస్యల పరిష్కారం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ మీటింగ్‌కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమ నుంచి 30 మంది ప్రతినిధులు పాల్గొననున్నట్లు సమాచారం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్నా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎవరూ వచ్చి సీఎం చంద్రబాబును కలవలేదంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది. సినిమాలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు ఇకపై ఎవరూ తన వద్దకు వ్యక్తిగతంగా రావొద్దని, అసోసియేషన్ తరఫునే రావాలని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -

Latest News