Homeబిజినెస్బోగులకుంటలో ఫెర్నాండెజ్ హాస్పిటల్ కొత్త OP క్లినిక్‌ ప్రారంభం

బోగులకుంటలో ఫెర్నాండెజ్ హాస్పిటల్ కొత్త OP క్లినిక్‌ ప్రారంభం

మహిళల ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడంలో భాగంగా, ఫెర్నాండెజ్ హాస్పిటల్ బోగులకుంటలో నూతన అవుట్‌పేషెంట్ క్లినిక్‌ను ప్రారంభించింది.

ఈ క్లినిక్ ఫెర్నాండెజ్ హాస్పిటల్ ప్రధాన ఆసుపత్రికి సమీపంలోనే ఉంది. ఇది నగర నడిబొడ్డున మహిళలు, శిశువులు, చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తుంది.

- Advertisement -
WhatsApp Image 2025 06 13 at 19.08.37 1

ఈ కొత్త క్లినిక్‌లో అన్ని ప్రత్యేక అవుట్‌పేషెంట్ సౌకర్యాలు ఒకే చోట లభిస్తాయి. గైనకాలజీ విభాగం PCOD, ఫైబ్రాయిడ్స్, వంధ్యత్వం వంటి సమస్యలకు ప్రత్యేక సంప్రదింపులు, అత్యాధునిక అల్ట్రాసోనోగ్రఫీ-గైడెడ్ చికిత్సలను అందిస్తుంది. ఇది ఆసుపత్రిలో ఉండే సమయాన్ని, వైద్య ఖర్చులను తగ్గిస్తుంది. ఈ క్లినిక్‌లో నియోనాటాలజీ, పీడియాట్రిక్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో నవజాత శిశువులు, పిల్లల ఆరోగ్యాన్ని పరిశీలించడం, వారి ఎదుగుదల పర్యవేక్షణ, నిపుణుల మార్గదర్శకత్వంలో టీకాలు వేయడంతోపాటు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి.

WhatsApp Image 2025 06 13 at 19.08.36

గర్భిణులు ప్రసవానంతరం కోలుకోవడానికి పెల్విక్ ఫ్లోర్, శస్త్రచికిత్స అనంతర పునరావాసం కోసం సమగ్ర ఫిజియోథెరపీ సేవలు అందిస్తారు. ఇతర సేవలలో అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా ఇన్-హౌస్ డయాగ్నస్టిక్ సేవలు, నమూనా సేకరణ, ఇన్-హౌస్ ఫార్మసీ, ప్రైవేట్ మిల్క్ ఎక్స్‌ప్రెషన్ సౌకర్యాలతోపాటు సర్టిఫైడ్ లాక్టేషన్ కౌన్సెలర్లు ఉంటారు.

WhatsApp Image 2025 06 13 at 19.08.36 1

“కరుణ మా ప్రతి పనికి ఆధారం. గౌరవం, సానుభూతి, క్లినికల్ ఎక్సలెన్స్‌తో కూడిన ఆరోగ్య సంరక్షణను అందించే మా నిబద్ధతకు ఈ నూతన క్లినిక్ దర్పం పడుతోంది” అని ఫెర్నాండెజ్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, ఎండీ డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్ అన్నారు.

WhatsApp Image 2025 06 13 at 19.08.37 2

అపాయింట్‌మెంట్ కోసం 1800-419-1397 కు కాల్ చేయండి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News