Wednesday, March 4, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐNRI Day | జీబీకేరావుకి సన్మానం

NRI Day | జీబీకేరావుకి సన్మానం

ప్రవాసి భారతీయ దివస్(Pravasi Bharatiya Divas)–2026 సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో విశేష సేవలు అందిస్తున్న ప్రగతి గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ (Founder Chairman of Pragathi Group) డాక్టర్ జి.బి.కె.రావు(Dr.GBK Rao)కి ప్రతిష్టాత్మక ‘భారత్ ప్రవాసి ఎక్సలెన్సీ అవార్డు’(Bharat Pravasi Excellence Award) లభించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన్ని భువనగిరి ఎంపీ(Bhongir MP) చామల కిరణ్ రెడ్డి(Chamala Kiran Reddy) సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడటం అంటే మానవ జాతిని కాపాడటమేనని చెప్పారు. ఈ సిద్ధాంతాన్ని నమ్మి లక్షలాది మొక్కలు నాటి ‘ప్రగతి బయోడైవర్సిటీ నాలెడ్జ్ పార్క్’(Pragati Biodiversity Knowledge Park)ను అభివృద్ధి చేయటం అభినందనీయమని తెలిపారు. జీబీకేరావు పర్యావరణ ప్రేమికులకు ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలకు మనమిచ్చే గొప్ప ఆస్తి పచ్చదనమేనని, విదేశాల్లో ఉన్న తెలుగువారు కూడా మాతృభూమి అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News