Saturday, October 4, 2025
ePaper
Homeజాతీయంఘోర ప్రమాదం.. అహ్మదాబాద్‌లో కూలిన విమానం..

ఘోర ప్రమాదం.. అహ్మదాబాద్‌లో కూలిన విమానం..

ఆ సమయంలో అందులో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇవాళ (జూన్ 12 గురువారం) ఘోర ప్రమాదం సంభవించింది. ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది మొత్తం 242 మంది ఉన్నారు. ఈ విమానం లండన్ వెళ్లేందుకు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరింది. ఫ్లయిట్ నంబర్ ఏఐ-171. అహ్మదాబాద్‌లోని మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ఏరియాలో 625 అడుగుల ఎత్తు నుంచి కుప్పకూలింది. విమానం మోడల్.. వైడ్‌బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులతోపాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News