Wednesday, February 11, 2026
Homeవరంగల్‌పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులకు రుణ నోటీసులు ఇవ్వడం అన్యాయం

పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులకు రుణ నోటీసులు ఇవ్వడం అన్యాయం

  • మోంథా తుఫాన్ తో తీవ్రంగా నష్టపోయిన జిల్లా ప్రజలను ఆదుకునేందుకు
  • ప్రత్యేక నిధులకై జిల్లా మంత్రి ఎమ్మెల్యేలు కృషి చేయాలి
  • ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట: అధిక వర్షాలు, మోంథా తుఫాన్, యూరియా కొరతలతో పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు పంట రుణాలు చెల్లించాలని సొసైటీలు, బ్యాంకులు నోటీసులు ఇవ్వడం దారుణమని తక్షణమే అట్టి నోటీసులను ఉపసంహరించుకొని పంట రుణాలను రీ షెడ్యూల్ చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. 

నర్సంపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుల వ్యవసాయం అధిక వర్షాలు యూరియా కొరతతో అస్తవ్యస్తంగా మారిందని, పంటల దిగుబడి తగ్గిందని ఈ క్రమంలో అరాకోరనైనా పంటలు చేతికి వచ్చే దశలో మోంథా తుఫాన్ తో ములిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారిందని, జిల్లాలో సుమారు లక్షా 50 వేల ఎకరాలలో పత్తి మొక్కజొన్న వరి తదితర పంటలు చేతికి వచ్చే దశలో కోల్పోయారని దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అయినా ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను తక్షణమే ఆదుకునే చర్యలు చేపట్టక పోవడం విడ్డూరంగా ఉందని పైగా రైతులు తీసుకున్న పంట రుణాలను చెల్లించమని ప్రాథమిక సహకార సంఘాలు బ్యాంకులు నోటీసులు ఇస్తూ రైతులపై ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టించిన అన్నదాతలకు ప్రకృతి, ప్రభుత్వాలు సహకరించని పరిస్థితుల్లో ఆత్మహత్యలే శరణ్యంగా భావించే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగం మనో ధైర్యంతో

- Advertisement -
RELATED ARTICLES

Latest News