Thursday, March 26, 2026
Homeవరంగల్‌Pollution | కలియ దున్నుమంటే కాల్చేస్తున్నారు….

Pollution | కలియ దున్నుమంటే కాల్చేస్తున్నారు….

  • భూమిలో ఖనిజాల మరణం….. పెరుగుతున్న కాలుష్యం..
  • రైతులకు ప్రచారం చేయడంలో శాఖల అలసత్వం

దేశానికి అన్నం పెట్టే రైతు అని వ్యవసాయ శాఖ తోపాటు హర్టికల్చర్, సెరికల్చర్ ఇంకా అన్ని కల్చర్లు కలిసి ప్రతిరోజు మొత్తుకుంటూనే ఉంటాయి. రైతుల కోసమే ఆ శాఖలు ఏర్పడ్డాయి అయినా రైతు సనాతన పద్ధతులతో పాటే ప్రయాణం చేస్తుండడం పలువురిని విస్మయానికి గురిచేస్తుంది. ఏళ్ల తరబడి పంట వ్యర్ధాలను తగలబెట్టకూడదని శాఖలు మొత్తుకుంటుంటే రైతులు వాటిని పట్టించుకోకుండా వందలాది ఎకరాల వరి పంట వ్యర్థాలను నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తున్నారు. దానివల్ల భూమిలోని పంటలకు అవసరపడు సూక్ష్మ జీవులు, ఖనిజలవనాలు అంతరించిపోతాయని అధికారులు రైతు చైతన్య యాత్రలో చెప్పాడు వారు.

అయినప్పటికీ యాసింగి పంట కోసం రైతులు మూకుమ్మడిగా తన తల్లి లాంటి భూమిపై పరుచుకున్న వరి పంట గడ్డిని ఎకరాల కొద్ది తగలబెట్టడం తో వాయు కాలుష్యం పెరగడంతో పాటు భూమి నిస్సా రమైపోతుంది. పంటల వ్యర్థాలను అవశేషాలను భూమిలో కలియ దున్నడం ద్వారా కనిజలవనాలు సూక్ష్మజీవులు పంటలకు వివిధ మేలు చేసే సూక్ష్మ క్రీములు పంటలకు మేలు చేస్తాయి. తగులబెట్టడం ద్వారా పంటలకు అవసరపడు సూక్ష్మజీవులు నశించడం ద్వారా యాసంగి పంట సరిగ్గా రాదని తెలిసినప్పటికీ రైతులు నిర్లక్ష్యం వహిస్తూ నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తుండడం గమనార్వం.

- Advertisement -

యావత్ ప్రపంచానికి తిండి పెట్టే రైతు ఇలా అజ్ఞానంగా తగలబెట్టడంపై ప్రభుత్వ అధికారులు వివిధ స్వచ్ఛంద సంస్థలు చూస్తూ ఉండిపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. సమాజంలో మార్పులు చేస్తున్నామంటూ అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సైతం జీతాలు పొందడం నిధులు కాజేయడం జరుగుతున్న తరుణంలో వారి నిస్వార్థ సేవ రైతుల వైపు మళ్లించి భూభారతిని కాపాడే ప్రయత్నం చేసేంతవరకు రైతు ఇలా ఇంకా సాంప్రదాయ పద్ధతిలోనే వ్యవసాయం చేయక తప్పదేమో అని భూమాత ప్రేమికులు పర్యావరణవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News