Wednesday, March 4, 2026
Homeవరంగల్‌IKP Purchase Center | ధాన్యంను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలి

IKP Purchase Center | ధాన్యంను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలి

రైతుల పండించిన వరి ధాన్యం ను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ రైతులకు సూచించారు. శనివారం మండలంలోని ముచ్చింపుల, రంగాపురం, రేలకుంట గ్రామాల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశానుసారం ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐకెపి కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వరిధాన్యంను విక్రయించూసుకోవాలని ఆయన రైతులకు తెలిపారు.

కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు వడ్లను తేమా లేకుండా తీసుకువచ్చి విక్రయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రజిత, ఏపీఎం సుధాకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతిరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, మండల కార్యదర్శి జిల్లా మునీందర్ ,జెట్టి రామ్మూర్తి ,మాజీ మండల అధ్యక్షులు రఘుపతిరావు, మండల నాయకులు జంగిలి మోహన్, రమేష్ ,రవీందర్రావు, శ్రీనివాస్ రెడ్డి, సారయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News