Friday, September 12, 2025
ePaper
spot_img
Homeఆజ్ కీ బాత్రైతు దేవుడు క‌దా.. రాజు ఎలా అవుతాడు..

రైతు దేవుడు క‌దా.. రాజు ఎలా అవుతాడు..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా..! మరి ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానీ పరబ్రహ్మాన్నే పండిస్తున్న రైతు దేవదేవుడు అవుతాడు కానీ, రాజు ఎలా అవుతాడు..? అలాంటివాడు సమతుల్యంలేని రాజకీయాల నడుమ దిక్కుతోచక కనిపించని దేవుణ్ణి కాపాడమని వేడుకుంటున్నాడు..! ఇవన్నిటి నడుమ దినదినం తనువు చాలించి ప్రాణాలొదిలేస్తున్న వందల పేద రైతుల దినవారములు చేయ దిక్కులేకుంటే, పాలకులు ఇంకా దేనికోసమో కంటితుడుపు చర్యగా ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని ప్రగల్భాలు దేనికి సంకేతమో నాయకులకే తెలియాలి. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో సుమారు 400 కి పైగా రైతు మరణాలు పత్రికల్లో వచ్చినా, చట్టసభల్లో మాత్రం నామమాత్రపు చర్చే..!

  • మహేష్‌ తమ్మడి
RELATED ARTICLES
- Advertisment -

Latest News