నిర్మల్ జిల్లా (Nirmal District) లోకేశ్వరం మండలం మొహాల గ్రామంలో దండే గంగన్న అనే రైతు (Farmer) ఇవాళ పొద్దున ఆత్మహత్య(Su*cide)కు పాల్పడ్డాడు. ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. ఆయన వయసు 53 ఏళ్లు. తన భూమిలో సాగు చేస్తున్న పత్తి (Cotton) పంట దిగుబడి ఆశించినంత రాకపోవడంతో మనస్తాపానికి గురై బలన్మరణం పొందాడు. అప్పుల (Debts) ఊబిలో చిక్కుకొని ఏం చేయాలో తోచక ఈ నిర్ణయం తీసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. గంగన్న మరణంతో మొహాల గ్రామంలో విషాదం నెలకొంది.
