హౌరా నుండి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్(Falaknuma Express) రైలును ఘట్కేసర్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం రావడం తో రైలును ఘట్కేసర్ రైల్వే స్టేషన్ లో పోలీసులు ఆపి తనిఖీలు చేపట్టారు. మరి కొద్దీ సేపట్లో సికింద్రాబాద్ చేరుకుంటుంది అన్న సమయంలో రైలు లో ఉగ్రవాదులున్నారని పోలీసులుకు ఫోన్ కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘట్కేసర్ రైల్వే స్టేషన్ కి చేరుకొని రైలును(Falaknuma Express) నిలిపివేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. సుమారు గంట పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. అనుమానం ఉన్న ప్రతి వ్యక్తిని తనిఖీ చేశారు. ఫోన్ కాల్ ఎవరు చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ తనిఖీలు వల్ల ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కొద్ది సేపటి తరువాత రైలు కదలడం తో ఊపిరి పీల్చుకున్నారు. ఇదొక ఫేక్ కాల్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం ఎవరు ఇచ్చారు అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు: