నకిలీ తుపాకీతో బెదిరించి, నగల దుకాణంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. నాగారం సత్యనారాయణ కాలనీలోని బాలాజీ నగల దుకాణంలో నగలు కొంటున్నట్లుగా నటిస్తూ, నకిలీ తుపాకీతో బెదిరించగా, యజమాని సందీప్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో దుండగులు సందీప్‌ను గొడ్డలితో తలపై కొట్టి గాయపరిచారు. సందీప్ గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వాళ్ళు వచ్చేలోగా దుండగులు పరారయ్యారు.సీసీ కెమెరాల సహాయంతో దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -
