Friday, April 10, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ప్రకృతి నవ్వేలా ఉండు… మనిషి బతికేలా చూడు..

Aaj Ki Baath | ప్రకృతి నవ్వేలా ఉండు… మనిషి బతికేలా చూడు..

ఓ సూర్య భగవానుడా నీ మీద కోపం లేదు.. ఎందుకంటే నీ తాపం లేకుంటే జీవం ఉండదు.. కానీ ఈసారి నీ దాహం ఎక్కువైంది.. భూమి చెమటలు పట్టేలా మండుతున్నావ్..మనుషుల ఊపిరి ఆడనీయకుండా చేస్తున్నావ్.. నీ వేడి కిరణాలు పంటలపై పడితే… రైతు గుండె దడపడుతోంది.. నీ కారణంగా చెట్లు నీడ కోల్పోతే… జీవజాలం ఆశ్రయం కోల్పోతోంది.. ఓ సూర్యుడా నీ తాపం అవసరమే.. కానీ నీ కోపం మాత్రం తగ్గించు.. నీ వల్లే జీవం..నీ వల్లే బాధ కూడా… సమతుల్యం పాటించు సూర్యుడా.. ప్రకృతి నవ్వేలా ఉండు… మనిషి బతికేలా చూడు..

  • చిట్టిమళ్ళ మహేందర్
- Advertisement -
RELATED ARTICLES

Latest News