- భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా…
- కిక్కర గోపీ శంకర్ యాదవ్
- రాష్ట్ర అధ్యక్షులు సురక్ష సేవా సంఘం తెలంగాణ.
రాజ్యాంగం ద్వారానే ప్రజలందరికీ సమ న్యాయం, సమ పాలన, సమానత్వం దొరుకుతుందని. అందుకే ఈ రోజు జాతీయ న్యాయ దినోత్సవం కూడా జరుపు కుంటారని. గోపీ శంకర్ అన్నారు. ఆంగ్లేయుల పరిపాలన అనంతరం మనకంటూ ఒక ప్రత్యేక విధి విధానాలు ఉండాలని.. మన దేశాన్ని మనమే పరిపాలించుకునే.. సామర్థ్యం మనకుందని దీనికి ఒక నిర్ధిష్టమైన రాజ్యాంగం అవసరమని మహనీయుడు దాదా సాహెబ్ అంబేడ్కర్ సారధ్యం లో రాజ్యాంగం రూపుదిద్దుకుంది… ఈ విధంగా రూపు దిద్దుకున్న రాజ్యాంగ పరిషత్ లో అనేక మంది మేధావులు ను సభ్యులుగా చేర్చి నవంబర్ 26 ..1949 వ సం లో ఆమోదం జరిగింది. కనుక ఈరోజు భారత దేశమంతటా రాజ్యాంగ దినోత్సవం జరుపు కుంటున్నాము.ఇంతటి శ్రమ ఫలితంగా..ఏర్పడిన మన రాజ్యాంగాన్ని ..
ప్రతీ ఒక్క భారతీయుడు గౌరవించాలని ..చట్టాల పై అవగాహన కలిగి ఉండాలని .. గోపి శంకర్ సూచించారు . ఈ రాజ్యాంగం వలనే ఈ రోజు సామాన్యుడు..కూడా రాజ్యం పాలించే స్థాయి కి చేరుకోవడం జరిగింది.రాచరికం అంతరించింది…ఓటు ద్వారా నాయకుడ్ని ఎన్నుకునే అధికారం వచ్చింది.అందుకే ఈరోజు కింది స్థాయి, పై స్థాయి అని తేడా లేకుండా అన్ని వర్గాలు వారు…సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు.ఇంకా దీనికోసం ప్రజల్లో విస్తృత మైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ప్రజల్లో చైతన్యం రావాలని ఈ సందర్భంగా తెలియ జేశారు.
