ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి అర్ధ భాగంలో మన దేశం నుంచి ఎగుమతులు(Exports), మన దేశానికి దిగుమతులు(Imports).. రెండూ పెరిగాయ్. కానీ.. ఎక్స్‌పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్సే ఇంకొంచెం ఎక్కువ జరిగాయి. దీంతో.. వాణిజ్య లోటు (Trade Deficit) పెరిగింది. ఈ ట్రేడ్ డెఫిసిట్ విలువ 154.99 బిలియన్ డాలర్లుగా నమోదైంది. రూపాయల్లో చెప్పాలంటే ఇది దాదాపు 13.64 లక్షల కోట్లకు సమానం. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో ఇండియా ఎగుమతులు 3.02 శాతం పెరిగి 220.12 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు మాత్రం 4.53 పెరిగి 375.11 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు తప్పలేదు.
Trade Deficit | ఎగుమతులు, దిగుమతులు రెండూ పెరిగినా..
RELATED ARTICLES
- Advertisment -
