Friday, April 10, 2026
Homeసాహిత్యంPen And Paper | కలం కదిలితేగాని.. కాగితం మాట్లాడదు..

Pen And Paper | కలం కదిలితేగాని.. కాగితం మాట్లాడదు..

రెక్కాడితేగాని డొక్కాడదు-
కడుపు నిండదు.. నిదుర పట్టదు..

గాలాడితేగాని శ్వాస అందదు-
గుండె కొట్టుకోదు.. ప్రాణం నిలువదు..

- Advertisement -

అనుభవిస్తేగాని అవగతం కాదు-
విశ్వాసం కలగదు.. ఆనందం దొరకదు..

కళ్ళతో చూస్తేగాని నిజాలు తెలియవు-
నమ్మబుద్ధిపుట్టదు.. రంగు బయటపడదు..

సాధన చేస్తేగాని పనులు సమకూరవు –
ఫలితాలు చిక్కవు.. ప్రతిభ వెల్లడి కాదు..

మనసు విప్పితేగాని నిజాలు తెలియవు –
అంతరంగం వెలువడదు.. విలువ బహిర్గతం కాదు..

అడుగులేస్తేగాని ముందుకు జరగము –
పయనం సాగదు.. గమ్యము చేరము..

కలం కదిలితేగాని కాగితం మాట్లాడదు –
కవితా పుష్పం పూయదు.. భావరాగం వెలుగొందదు.

  • గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్
- Advertisement -
RELATED ARTICLES

Latest News