హైదరాబాద్: పోలీసు స్మారక వారోత్సవం(Police Remembrance Week)లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ (Cyberabad Commissionerate) పరిధి సీటీసీ సీఏఆర్ ప్రధాన కార్యలయంలో సిబ్బందికి వ్యాస రచన పోటీలు (Essay Writing Competitions) నిర్వహించారు. ఈ పోటీల ముఖ్యఉద్ధేశం సిబ్బందిలో మేథాసంపతిని పెంచడం. సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించడం. పోలీసు అధికారుల్లో అవగాహన విమర్శనాత్మక ఆలోచన స్పష్టమైన వ్యక్తీకరణ సామార్థ్యాని పెంపొందించడం.
పోలీస్ శాఖ(police department)లో డ్యూటీలు నిర్వహించే సిబ్బందికి ఆంగ్లం(English), తెలుగు (Telugu) భాషల్లో ప్రావీణ్యం, తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఒక చక్కటి వేదికగా మారింది. ఈపోటీలు రెండు విభాగాల్లో నిర్వహించారు. కేటగిరి 1.. పీసీ ఆర్‌పీసీ, ఏఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ వరకు సిబ్బందికి ఉద్యోగ స్థలంలో లింగ వివక్ష. కేటగిరి 2.. గ్రౌండ్ లెవల్ పోలీసింగ్ బలోపేతం. ఈ పోటీల కార్యక్రమంలో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
