Tuesday, March 31, 2026
Homeహైదరాబాద్‌Aviation | ఏవియేషన్ రంగంలో భారతదేశంలో మెరుగైన అవకాశాలు.

Aviation | ఏవియేషన్ రంగంలో భారతదేశంలో మెరుగైన అవకాశాలు.

పైలెట్ కావాలి అనుకునే మధ్యతరగతి విద్యార్థులకు సైతం అవకాశం కల్పించాలన్నదే తమ లక్ష్యమని, ఏవియేషన్ రంగంలో భారతదేశంలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. సోమవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వే ఫర్ స్కై చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రైహాన్, విశ్రాంత డీజీసీఏ అధికారి అరవింద్ తప్లియాల్ మాట్లాడుతూ… విద్యార్థులకు పైలట్ కావాలన్న ఆకాంక్ష ఉంటుందని, కాని అది నెరవేర్చుకునే వేదిక తెలియక చాలా మంది వెనుకబడి పోతున్నారన్నారు.

పైలెట్ కావాలంటే డబ్బు ఉన్న వారే కాదు, పేద, మధ్యతరగతి విద్యార్థులకు సైతం అవకాశం కల్పించాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇతర దేశాల్లోనూ పైలెట్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారి లైసెన్సులు భారతదేశంలోనూ పనిచేస్తాయని, ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ఏవియేషన్ ఎక్స్పోకు 900 మంది విద్యార్థులు హాజరయ్యారని, వారికి ఏవియేషన్ రంగంపై అవగాహన కల్పించామన్నారు.

- Advertisement -

నగరంలో నాలుగు ఏయిర్ఫోర్స్ అకాడమీలు ఉన్నాయని, హైదరాబాద్ ఏవియేషన్ హబ్ గా మారుతోందని తెలిపారు. దేశంలో ఏవియేషన్ రంగాన్ని మరింత విస్తృతం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఇంటర్నేషనల్ ఏవియేషన్ ఫ్లైట్ అకాడమీ ప్రతినిధి కెప్టెన్ యోహాన్, ఉరుగ్వే, జోహాన్స్ బర్గ్, శ్రీలంక దేశాలకు చెందిన ప్రతినిధులు మారియో సంతోష్, కెప్టెన్ మూసా ధనుంజయ వీరసింహా, స్కై ప్రో అకాడమీ ప్రతినిధి రిషబ్, పునీత్, అంబిక తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News