Friday, October 3, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుసూసైడ్ | ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య...సీనియర్ల వేధింపులే కారణం

సూసైడ్ | ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య…సీనియర్ల వేధింపులే కారణం

సీనియర్ల వేధింపులకు నిండు ప్రాణం బలి. చదువుకుని ఉద్యోగం చేస్తాడనుకుంటే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇస్తాడనుకుంటే…మర్చిపోలేని బాధ ఇచ్చాడు.

నారపల్లి లో ఉన్న సిద్దార్థ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లో ఇంజినీరింగ్ చదువుతున్న జాదవ్ సాయి తేజ అనే విద్యార్థి మేడిపల్లి లో ఉన్న తన హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది. సీనియర్ల వేధింపుల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు.

​సాయి తేజ మృతికి ముందు తన తల్లిదండ్రులకు పంపించిన వీడియోలో తన సీనియర్లు తన డబ్బులన్నీ లాక్కున్నారని, తనను చాలా దారుణంగా కొట్టారని చెప్పాడు. అతని స్నేహితులు చెప్పిన దాని ప్రకారం సీనియర్లు సాయి తేజను ఒక బార్‌కి తీసుకెళ్లి, అక్కడ రూ. 10,000 బిల్లు కట్టమని బలవంతం చేశారని, మద్యం తాగమని కూడా ఒత్తిడి చేశారని తెలిసింది.

​ఈ ఘటనపై సాయి తేజ తండ్రి స్పందిస్తూ, తన కొడుకుది ఆత్మహత్య కాదని, ఇదొక హత్య అని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చెయ్యాలని, సాయి తేజ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

​పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్ల వేధింపుల గురించి, విద్యార్థి పంపించిన వీడియో గురించి లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఆందోళన కలిగించింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News