Wednesday, March 4, 2026
Homeరంగారెడ్డిEetala Rajender | ల్యాండ్ బ్రోకర్ల భరతం పడతాం

Eetala Rajender | ల్యాండ్ బ్రోకర్ల భరతం పడతాం

మాఫియా గ్యాంగ్ లీడర్ వెంకటేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
ఏకశిలా నగర్‌ను సందర్శించిన ఎంపీ ఈటల రాజేందర్
ప్లాట్ ఓనర్లు, బాధితులకు పరామర్శ
మీకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మునిసిపాలిటీలోని ఏకశిలానగర్‌(Ekashila Nagar)ను ఎంపీ ఈటల రాజేందర్(Mp Eetala Rajender) సందర్శించారు. బాధితులను పరామర్శించి ప్లాట్ ఓనర్ల(Plot Owners)తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పటి కొర్రెముల గ్రామంలో 1985లో 146 ఎకరాల్లో 2086 ప్లాట్లు చేస్తే చిన్న చిన్న నౌకరీలు చేసుకొనేవారు వందల మంది ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు. కానీ ఇక్కడ ల్యాండ్ మాఫియా గ్యాంగ్(Land Mafia Gang Leader) వెంకటేష్ ఆ జాగాలను రెవెన్యూ రికార్డులో ఉండే లొసుగులను ఆసరా చేసుకొని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉండే దొంగలను పట్టుకొని, ఆ ఓనర్లను పట్టుకొని, 47 ఎకరాల భూమిని పట్టా చేసుకున్నాడట.

- Advertisement -

ఇప్పటినుంచి ఈ ఏకశిలా నగర్ వాసులకు కష్టాలు మొదలయ్యాయి. డబ్బులకు ఆశపడి నాటి రెవెన్యూ అధికారులు గుండాలకు మద్దతిచ్చారు. అప్పటి పోలీసులు వీడికి మద్దతు తెలిపారు. సింగరేణిలో, ఎలక్ట్రిసిటీలో ఉద్యోగాలు చేసేవారు, పాలు అమ్ముకొనే వారు, కూరగాయలు అమ్ముకునే వారు ఇక్కడ కొనుక్కున్నారు. చెట్టుకొకరు పుట్టకొకరు ఉండి ఐక్యత లేకుండా ఉన్నారు కాబట్టి, శక్తి లేనివారు కాబట్టి, వారిని కొడతాం చంపుతాం అని బెదిరిస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా ఇలా జరుగుతుందంటే నేనే స్వయంగా ఇక్కడికి వచ్చాను. నా కళ్ల ముందే వెంకటేశ్వర్లు‌కు చెందిన భూమాఫియా గుండాలు ఇక్కడే తాగుతున్నారు.

నేను ఇక్కడికి వస్తున్నా అని తెలుసుకొని ముందు రోజు రాత్రి ఆ గుండాలు ఇంటింటికి వెళ్లి బెదిరించారు. ఎంపీ వస్తున్నారని టెంట్ వేసినా మీటింగ్‌కు వచ్చినా మీ సంగతి చెప్తామని బెదిరించారు. నేను వచ్చాక ఇక్కడే ఉన్నవారి భారతం పట్టాను. నాటి డీజీపీ, కలెక్టర్, ఉన్నతాధికారులతో మాట్లాడాను. సమస్య పరిష్కారమైందని భావించాను. 2026 మందికి చెందిన ప్లాట్లు తప్ప వ్యవసాయ భూమి లేదు అని చెప్తున్నా కూడా మళ్లీ ఇక్కడికి అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే చేయడానికి వచ్చాడంట. వాళ్ల కళ్లు దొబ్బాయా?. మరి ఎందుకు ఇక్కడికి వస్తున్నారో అతని మీద కూడా కంప్లైంట్ చేపిస్తాం.

ఒక ఎంపీ వచ్చి పోయిన సంవత్సరమే ఇంత ఇష్యూ అయి నా మీద కూడా కేసులు పెట్టి ఆ కేసులు నడుస్తున్నప్పుడు కలెక్టర్‌కు, రెవెన్యూ అధికారులకు, పోలీసులకు మొత్తం తెలిసినప్పటికీ కూడా ఎవరి ఎంగిలి మెతుకులకు ఆశపడి సర్వేకు వచ్చారు? వారిని అడ్డుకునేందుకు ఫ్లాట్ ఓనర్లు వస్తే వారిని గుండాలు కొట్టిన తీరు బాధ కలిగిస్తోంది. నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి రాలేదు. మిస్టర్ వెంకటేష్ నీ భరతం పడతా. నీకు మద్దతు పలుకుతున్న రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారుల వెంట కూడా పడతామని హెచ్చరిస్తున్నాం. ఎవరినీ వదిలిపెట్టం. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజల జీవితాలతో చెలగాటమాడతారా?.

ఏకశిలా నగర్ మాత్రమే కాదు. అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఆనాడు తొండలు కూడా గుడ్లు పెట్టని ప్రాంతాల్లో స్థలాలు కొనుక్కుంటే భూములకు విలువ పెరగ్గానే గూండాలు, బ్రోకర్లు, రెవెన్యూ అధికారులు, దొంగలు, ల్యాండ్ మాఫియాలు కుమ్మక్కై కోర్టులను కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి నోటికాటి బుక్క గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి సాగదు. రేవంత్ రెడ్డీ మీరు పరిపాలన సాగిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కలిగించని మీ వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాలి. నీ పోలీసులు ఉన్నది చట్టాన్ని కాపాడటానికి, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడానికి.

గుండాల మీద ఉక్కు పాదం మోపడానికి. లా అండ్ ఆర్డర్ కాపాడటానికి. కానీ.. మీ పోలీసులు, అధికారులు వారి ఎంగిలి మెతుకులకు ఆశపడి మద్దతు తెలిపితే ఎలా? ఆలోచించమని సీఎంని కోరుతున్నా. కలెక్టర్‌ను అడుగుతున్నా.. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ నీ కంట్రోల్లో ఉందా? లేదా? ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాల గురించి నీకు సోయి ఉందా లేదా? గతంలో కూడా లెటర్లు ఇచ్చాను. మళ్లీ రెవెన్యూ మంత్రిని అడుగుతున్నా. హైదరాబాదులో జీహెచ్ఎంసీ పరిధిలో అనేక మంది చిన్నచిన్న కుటుంబాలు కొనుక్కున్న ఆస్తులకు రక్షణ లేకుండాపోయింది.

ఆనాడు ధరణి పేరిట, ఈనాడు భూభారతి పేరిట అదే గుండాలు అదే ల్యాండ్ మాఫియాలు అదే బ్రోకర్లు రాజ్యమేలుడుతున్నారు తప్ప ప్రజలు ప్రశాంతంగా లేరు. హైదరాబాద్‌లో ప్లాటు కొనుక్కోవాలంటే ప్రజలు భయపడుతున్నారు. వెంకటేశ్వర్లు మీద హత్యా నేరం మోపి 24 గంటల్లో జైల్లో పెట్టకపోతే ఈ ఉద్యమం ఉదృతం చేస్తాం. సామాన్య ప్రజానీకానికి ఎవరు లేరని మీరు దౌర్జన్యం చేస్తే వ్యవస్థ ఎటు పోతుంది?

పోలీసులు ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేయకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అండగా ఉంటామని మద్దతిస్తున్నాం. మా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. 24 గంటల్లోపు బాధ్యతలను అరెస్టు చేయకపోతే వారి వెనక వెంకటేష్ మీద హత్యా నేరం మోపి అరెస్టు చేయకపోతే 48 గంటల తర్వాత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ల్యాండ్ బ్రోకర్ల భరతం పడతాం. మీరు భయపడకండి. మా కార్యకర్తలు నాయకులు మీకు అండగా ఉంటారు. కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత మాది. మీరు ఐక్యంగా ఉండండి అని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News