Tuesday, October 28, 2025
ePaper
Homeరాజకీయంనేడు ‘కాళేశ్వరం‘ విచారణకు ఈటల

నేడు ‘కాళేశ్వరం‘ విచారణకు ఈటల

9న హరీష్‌రావు, 11న కేసీఆర్

ప్రస్తుత ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ (జూన్ 6 శుక్రవారం) ఉదయం 10 గంటలకు కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరుకానున్నారు. ఈ ప్రాజెక్టులో జరిగిన లోటుపాట్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈటలను ప్రశ్నించనుంది. ముఖ్యంగా ఆర్థిక అంశాలపై క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయనున్నారు‌. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా విచారణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రాజెక్టు డిజైన్, నాణ్యత లోపాలపై ఆరా తీయనుంది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కార్యాలయం హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు (బీఆర్కే) భవన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ అక్కడికే వెళ్లనున్నారు‌.

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం జరిగిన సమయంలో ఆయనే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. పలు కీలక కమిటీల్లోనూ సభ్యుడిగా ఉండేవారు. దీంతో కాళేశ్వరం కమిషన్.. అప్పటి సర్కారు నిర్ణయాలపై సమాచారం రాబట్టనుంది. దీనికోసం ఇప్పటికే ప్రశ్నలను రెడీ చేశారని తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో నియమించిన పలు కమిటీలకు ఈటల నేతృత్వం వహించారు. మరికొన్ని కమిటీల్లో మెంబర్‌గా ఉన్నారు.

అందువల్ల కమిషన్‌‌కు ఈటల ఇచ్చే వాంగ్మూలం కీలకంగా మారనుంది. విచారణ ఇప్పటికే చివరి దశకు చేరింది. ఈటల రాజేందర్‌ తర్వాత ఈ నెల 9న మాజీ మంత్రి హరీశ్‌రావు, 11న మాజీ సీఎం కేసీఆర్‌ కూడా విచారణకు హాజరుకానున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News