Friday, October 10, 2025
ePaper
HomeజాతీయంED | దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాల్లో ఈడీ సోదాలు

ED | దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాల్లో ఈడీ సోదాలు

ప్రముఖ సినీనటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చకల్‌కల్ నివాసాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. కేరళ, చెన్నైల్లోని మొత్తం 17 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించి ఈడీ అధికారులు ఈ దర్యాప్తు చేస్తున్నారు. ఇక, ఈ కేసు మూలాల్లోకి వెళ్తే, భూటాన్ ఆర్మీ ఇటీవల తన వాహనశ్రేణిలోని కొన్ని ఖరీదైన వాహనాలను తీసివేసింది. ఆ ఖరీదైన కార్లను కొందరు ఏజెంట్లు వేలంలో అతి తక్కువ ధరకు దక్కించుకున్నారు. వాటిని ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా భారత్‌కు స్మగ్లింగ్ చేశారన్న సమాచారం ఈడీకి చేరింది. సినీ, వ్యాపార వర్గాల్లోని కొందరిని గుర్తించి వారికి మాత్రమే ఈ కార్లను విక్రయిస్తున్నారని తెలుస్తోంది.

 లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసుపై కస్టమ్స్ అధికారులు ‘ఆపరేషన్ నమకూర్’ పేరుతో దేశవ్యాప్తంగా పలువురి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కోచి, తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లతో పాటు, పనంపిల్లి నగర్లోని దుల్కర్ నివాసానికి వెళ్లి సోదాలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News