Thursday, February 12, 2026
HomeజాతీయంED Notice | కేరళ సీఎం పినరయ్ విజయను ఈడీ నోటీసులు

ED Notice | కేరళ సీఎం పినరయ్ విజయను ఈడీ నోటీసులు

రూ.2,000 కోట్ల మసాలా బాండ్‌ కేసులో నోటీసులు జారీ.. సీఎంతోపాటు ఆయన పర్సనల్‌ సెక్రటరీ, ఆర్థికశాఖ మాజీ మంత్రి థామస్‌ ఐజాక్‌కు షోకాజ్‌ నోటీసులు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. రూ.2,000 కోట్ల మసాలా బాండ్ కేసులో నోటీసులు జారీ చేసింది. సీఎంతోపాటూ ఆయన పర్సనల్ సెక్రటరీ, ఆర్థికశాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్కు సోమవారం షోకాజ్ నోటీసులు పంపింది. 2019లో మసాలా బాండ్ జారీలో విదేశీ మారకపు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ నోటీసులు జారీ చేసింది. రూ. 466 కోట్ల లావాదేవీలకు సంబంధించి ఈ నోటీజులు జారీ చేసినట్లు తెలిసింది.

- Advertisement -

రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లను సేకరించే ప్రణాళికలో భాగంగా పినరయి విజయన్ ప్రభుత్వం ఈ బాండ్లను తీసుకువచ్చింది. అయితే ఈ నిధులను అక్రమంగా మళ్లించారని, ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారని ఈడీ ఆరోపిస్తోంది. దానిలో భాగంగా ఈ జనవరిలో థామస్ కు దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం ఇచ్చిన షోకాజ్ నోటీసులు రూ.468 కోట్ల లావాదేవీలకు సంబంధించినవని అధికారులు వెల్లడించారు. ఈ నోటీసుల కింద సీఎం వ్యక్తిగతంగా దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాల్సిన అవసరం లేదు. 2019లో మసాలా బాండ్ జారీలో విదేశీ మారకపు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ నోటీసులు జారీ అయ్యాయి.

2019లో కేరళ రాష్ట్రం మసాలా బాండ్లను జారీచేసింది. ఆ తరహా బాండ్లను జారీ చేసిన తొలి రాష్ట్రం కేరళనే. భారత సంస్థలు విదేశాల్లో స్థానిక కరెన్సీలో కాకుండా భారత కరెన్సీలో వీటిని జారీ చేశాయి. దేశీయంగా వృద్ధికి దోహదపడేలా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించడం, రూపాయి అంతర్జాతీయీకరణ వీటి ఉద్దేశం. ఈ బాండ్ల ద్వారా కేరళ ఇన్ఫ్రాస్టక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డ్ రూ.2వేల కోట్లమేర సమీకరించింది. తర్వాత అవి లండన్ ఎక్స్చేంజీకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఆ మొత్తం విలువ రూ.2,150 కోట్లకు పెరిగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News