Tuesday, March 3, 2026
HomeజాతీయంE-Cigarette | ఈ - సిగరెట్ దుమారం

E-Cigarette | ఈ – సిగరెట్ దుమారం

బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపణ చర్యలు తీసుకోనున్నట్లు స్పీకర్ స్పష్టం

గడువు పొడిగింపు..

- Advertisement -
  • నాలుగు రాష్ట్రాల్లో ముగిసిన సర్ ప్రక్రియ
  • తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గడువు పొడిగింపు.. అండమాన్ నికోబర్ కేంద్రపాలి ప్రాంతంలోనూ పొడిగింపు..

పార్లమెంట్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ.. సభా పరిసరాల్లోనే ఈ – సిగరేట్ తాగినట్లు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. లోక్సభలో ఆయన ఈ విషయాన్ని స్పీకర్ ఓం బిర్లా ముందు ప్రస్తావించారు. అయితే ఆ ఈ-సిగరేట్ తాగిన వ్యక్తిపై చర్యలు తీసుకోనున్నట్లు స్పీకర్ బిర్లా పేర్కొన్నారు. ఇలా ఎవరు చేసినా సహించేది లేదన్నారు. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో సప్లిమెంటరీ అడిగిన సమయంలో బీజేపీ ఎంపీ ఆ విషయాన్ని గుర్తు చేశారు. సభలో ఈ-సిగరెట్లకు అనుమతి ఉందా అని ఎంపీ అనురాగ్.. స్పీకర్ బిర్లాను అడిగారు. లేదు అని ఆయన సమాధానం ఇచ్చారు.

అయితే గత కొన్ని రోజుల నుంచి టీఎంసీ ఎంపీ సభలో ఈ-సిగరేట్ తాగుతున్నట్లు ఎంపీ ఠాకూర్ ఆరోపించారు. ఆ ప్రతిపక్ష ఎంపీపై చర్యలు తీసుకోవాలని అనేకమంది బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. భారీగా నినాదాలు రావడంతో.. సభ్యుల్ని స్పీకర్ బిర్లా శాంతపరిచారు. హుందాగా వ్యవహరించాలన్నారు. ఒకవేళ ఏదైనా లిఖితపూర్వక ఫిర్యాదు నమోదు చేస్తే, అప్పుగు ఆ ఎంపీపై చర్యలు తీసుకుంటానన్నారు. కొన్నేళ్ల క్రితమే ఇండియాలో ఈ-సిగరేట్లను నిషేధించారు. అయితే సోషల్ మీడియా పుకార్ల ప్రకారం.. టీఎంసీ ఎంపి మహువా మైత్రి.. పార్లమెంట్లో ఈ-సిగరేట్లు తాగుతున్నట్లు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News