Tuesday, February 10, 2026
HomeరాజకీయంEatala Rajendar | ఫ్రీబస్ తప్ప ఏం లేదు

Eatala Rajendar | ఫ్రీబస్ తప్ప ఏం లేదు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సూరారంలో గోకుల యాదగిరితోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు(Joinings in Bjp). కాంగ్రెస్ పాలనలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని మల్కాజ్‌గిరి ఎంపీ(Malkajgiri MP) ఈటల రాజేందర్ విమర్శించారు. ఒక్క ఫ్రీ బస్(Free Bus) తప్ప ఏ పథకం అమలు కావడం లేదని అన్నారు. ‘మహిళకు రూ.2500 ఇవ్వడం లేదు. పెన్షన్ పెంచలేదు(No Pension). 65 ఏళ్లు పైబడినవారికి, భర్త చనిపోయిన వారికి కొత్త పెన్షన్లు లేవు. వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. పెన్షన్లు లేవు. మాటలు కోటలు దాటాయి కానీ కాళ్లు తంగెళ్లు దాటడం లేదు.

తులం బంగారం లేదు, ఇల్లు లేవు, పేదవాడి బతుకు ఛిద్రం అవుతోంది. ప్రధాని మోదీ(PM Modi) పుణ్యమా అని బియ్యం వస్తున్నాయి. ఉపాధి హామీ డబ్బులు వస్తున్నాయి తప్ప ఇక్కడ ఏమీ ఇవ్వడం లేదు. సీఎం.. మమ్మల్ని కోసినా ఒక్క రూపాయి లేదు అంటున్నావు మరి ఆరు గ్యారెంటీలు ఇచ్చే ముందు ఎవరిని అడిగి ఇచ్చావు. కెసిఆర్‌కి ఓటేశాం. రేవంత్ రెడ్డికి ఓటేశాం. కానీ మా పేదల బతుకులు మారలేదు. ఈసారి మా ఓటు బీజేపీకి అని ప్రజలంటున్నారు. దేశమంతా మోడీ గాలి వీస్తోంది. దోపిడీలేని, మచ్చ లేని ప్రభుత్వం నడుస్తోంది. కానీ.. ఇక్కడ 50 ఏళ్ల క్రితం గాజులరామారంలో వడ్డెరలు ఇళ్ళు కూలగొట్టారు.

- Advertisement -

పెద్దల భూములు మాత్రం కాపాడుతున్నారు. గుండాయిజం దోపిడీ నడిపిస్తున్నారు. ఇది మారాలంటే బీజేపీ రావాలి. గోకుల యాదగిరి, ఆయనతో పాటు అనేక మంది ఈరోజు బీజేపీలో చేరారు. మీరందరూ ఇంటింటికి బీజేపీని తీసుకొని పోవాలి. GHMC ఎన్నికల్లో దెబ్బకొడితే దిమ్మ తిరగాలి. ఎంపీగా పేదల జీవితాల్లో వెలుగు నింపడానికి నా వంతు కృషి చేస్తా. మీ విశ్వాసం వమ్ము చేయకుండా సర్వీస్ చేస్తా. కొత్తగా చేరినవారు పాతవారు అందరూ కలిసి పనిచేయాలి. బీజేపీని గెలిపించాలి ’ అని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News