- భారీ జరిమానాలు, జైలు శిక్ష తప్పదు..!
- కుకునూరుపల్లి ఎస్ఐ హెచ్చరిక
మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని కుకునూరుపల్లి ఎస్ఐ పి. శ్రీనివాస్ గట్టిగా హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, ట్రాఫిక్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మొదటిసారి పట్టుబడితే ₹10,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష. ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడ జరుగుతుంది. రెండవసారి పట్టుబడితే: ₹15,000 జరిమానా విధిస్తారు జరిమానా కట్టకపోతే: జైలు శిక్ష తప్పదు. ఈ నిబంధనల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఎస్ఐ శ్రీనివాస్ స్పష్టం చేశారు.
వాహనదారులకు, ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, వాహనదారులు, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం సేవించి వాహనం నడపవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగి వాహనాలు నడపకూడదు.
మైనర్ డ్రైవింగ్ వద్దు మైనర్లు వాహనాలు నడపరాదు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు. పత్రాలు తప్పనిసరి ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్, సరైన నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపరాదు.సైలెన్సర్ మార్చి శబ్ద కాలుష్యానికి కారణమయ్యేలా వాహనాలు నడపవద్దు..
భద్రతా నియమాలు ప్రతి వాహనదారుడు వ్యక్తిగత భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలి.
నిబంధనలు పాటించి, వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. పై నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ పి. శ్రీనివాస్ హెచ్చరించారు.
