- ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు
దశబ్ద కాలంలో నిరీక్షించిన నెరవేరని కల.. నేడు ప్రజాపాలన ప్రభుత్వంలో నిరుపేద జీవితాల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు తో సొంతింటి కల నెరవేరుతూ, వెలుగులు నింపాయని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని రామతీర్థం గ్రామానికి చెందిన సట్ల ఐలమ్మ అనే లబ్ధిదారురాలు కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అట్టి ఇంటి నిర్మాణంను లబ్ధిదారులు పూర్తి చేశారు. మండలంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కాగా,అట్టి ఇంటి గృహప్రవేశానికి ఎమ్మెల్యే దొంతి ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి, లబ్ధిదారుని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యేకు ,ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు..
నాడు పల్లెల్లో ఇందిరమ్మ ఇండ్లతోనే సొంతింటి కల నెరవేరిందని, నేడు నిరుపేద మా కుటుంబానికి సొంతింటి కల ప్రజా పాలన ప్రభుత్వంతో నెరవేరిందన్నారు. మా సొంత ఇంటి కల నెరవేరడానికి ముఖ్య కారణమైన ఎమ్మెల్యే మాధవ రెడ్డికి, ప్రజా పాలన ప్రభుత్వానికి లబ్ధిదారుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
