- ఇప్పటికే పంపిణీ జరిగింది.. తగినంత స్టాక్ ఉంది
- మొయినాబాద్ వ్యవసాయ అధికారి అనురాధ వెల్లడి
అన్నదాత యూరియా కోసం యాతన పడాల్సిన పరిస్థితి లేదని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక్కసారిగా రైతులందరికీ యూరియా అందించలేక పోవడం జరిగిందని, దశల వారీగా ప్రతియొక్క రైతుకు యూరియా పంపిణీ జరుగుతోందని మొయినాబాద్ వ్యవసాయ అధికారిని అనురాధ స్పష్టం చేశారు. రైతులందరూ ఒక్కసారిగా రావడం, సప్లయ్, సిబ్బంది కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల ఆలస్యమైందే తప్ప రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనురాధ హామీ ఇచ్చారు. రైతులకు తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, అలాగే నేడు మరొక లాట్ వస్తుందని తెలియజేయడం జరిగింది. రద్దీ నివారించడానికి రైతు వేదిక, మొయినాబాద్ వద్ద టోకెన్లు ఇచ్చామని వారు తెలిపారు. సోషల్ మీడియా, మరికొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు, వీడియోలు రైతులను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి మొయినాబాద్ మండలంలో యూరియా కోసం రైతులు చింతించాల్సిన అవసరం ఏమాత్రం లేదని, రైతులకు సకాలంలో యూరియా సప్లయ్ జరుగుతుందని మొయినాబాద్ మండల వ్యవసాయ అధికారిని అనురాధ రెడ్డి పేర్కొన్నారు.