Tuesday, February 10, 2026
Homeసాహిత్యంStatues | విగ్రహావిష్కరణలకే పరిమితమా?

Statues | విగ్రహావిష్కరణలకే పరిమితమా?

ఊరంతా మహనీయులే. వాడ వాడా విగ్రహాలే. కులానికి మతానికొకటి. ఆర్భాటంగా కొలువుదీరిన.. రకరకాల బొమ్మలు. వారు చూపిన బాటలో.. నడిచేవారెందరు?. నడిపించేవారెవ్వరు?. రంగు రంగుల లోకంలో.. కళ(Art) నిండిన ఊరేగింపుతో.. విగ్రహావిష్కరణలు. నిగ్రహం కోల్పోతూ చిందులు(Dances). వారు చెప్పిన మాటను, వారి ఆచరణ సూత్రాన్ని జీర్ణించుకున్నవారు ఎందరు?. ఆచరించేవారు ఎందరు?. మూఢ భక్తిశ్రద్ధలతో బొమ్మల్ని తీర్చుతారు. సంవత్సరానికోమారు పూల దండలు(Flower Garlands) వేస్తారు. ఆ మహనీయుల జాడను పుణికిపుచ్చున్నవారెందరు? ఆ మహానుభావుల తోవలో అడుగులేసినవారు ఎందరు? దేశం ఉన్నతి(Country Development) కోసం ఒకరు.. మూఢత్వం పోగొట్టింది ఒకరు. జాతి పెన్నిధి కోసం ఒకరు.. మానవ విలువల(Human Values) కోసం ఒకరు. వారు చూపించినదారిలో నడుస్తున్నవారెందరు?. చదివి గ్రహించినవారెందరు?

  • నరెద్దుల రాజారెడ్డి
- Advertisement -
RELATED ARTICLES

Latest News