ఓ మనిషి..! అంతా నాదే.. అంతా నాకే అంటూ అతిగా ఆశ పడకు.. అన్యాయంగా అక్రమంగా అమాయకుల ఆస్తులను దోచుకోకు.. దాచుకోకు… సిగ్గు లజ్జా లేకుండా దర్జాగా అనుభవించకు.. పుచ్చుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేర్చుకో… ఎంత ఎత్తుకు ఎదిగినా తృప్తిలేక పీకలదాకా తిన్నా కంచంలో మిగిలింది.. కనీసం కాపలా కుక్కకైనా వీధిలో అరిచే బిక్షగాడికైనా పెట్టక రేపటి కోసం ఫ్రిడ్జ్ లో దాచుకోకు.. అందుకే ఓ మనిషీ..! మంచిని.. మానవత్వాన్ని ప్రేమను అందరికీ పంచు..
- కనకమామిడి సన్నీ