Thursday, March 26, 2026
Homeస్పోర్ట్స్Chess | పరాభవం పాలైన దొమ్మరాజు గూకేష్..

Chess | పరాభవం పాలైన దొమ్మరాజు గూకేష్..

వరల్డ్‌ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ ప్రేగ్‌ ఇంటర్నేషనల్‌ చెస్‌ మాస్టర్స్‌లో పరాభవాల పరంపరను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో ఇంకా బోణీ కొట్టని అతడు.. సోమవారం జరిగిన ఐదో రౌండ్‌లోనూ ఓడిపోయాడు. తెల్లపావులతో ఐదో రౌండ్‌ ఆడిన గుకేశ్‌.. నొదిర్‌బెక్‌ అబ్దుసతారోవ్‌ చేతిలో ఓడాడు. టోర్నీ బరిలో ఉన్న అరవింద్‌ చిదంబరం కూడా అదే బాటలో నడిచాడు.

కాగా 11 ఏండ్ల వయసులోనే రేసింగ్‌లో అంచనాలకు మించి అదరగొడుతున్న అతికా మిర్‌ మరో సంచలనం సృష్టించింది. స్పెయిన్‌లోని వాలెన్సియాలో జరిగిన చాంపియన్స్‌ ఆఫ్‌ ది ఫ్యూచర్‌ అకాడమీ (కోట్ఫా) కార్టింగ్‌ సిరీస్‌లో మూడో స్థానంలో నిలిచి రికార్డు నెలకొల్పింది. యూరోపియన్‌ అంచెలో భాగంగా జరిగిన ఈ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలవడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత రేసర్‌గా అతికా కొత్త చరిత్ర లిఖించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News