- మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు దొడ్డ వెంకటలక్ష్మి ..
- ఇరవై వేలఖర్చుతో మిని వాటర్ ప్లాంట్ బహుకరణ..
మండలంలోని బోజేర్వు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు దొడ్డ వెంకటలక్ష్మి తన ఉదారతను చాటుకున్నారు. శనివారం పాఠశాల ఆవరణలో ఆమె స్వంత ఖర్చుతో ఏర్పాటు చేసిన మిని వాటర్ ప్లాంట్‌ను గ్రామ సర్పంచ్ కుసుమ సతీష్ రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా దొడ్డ వెంకటలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టగలరని, కలుషిత నీటి వల్ల వచ్చే అనారోగ్యాల నుండి పిల్లలను రక్షించాలనే లక్ష్యంతో ఈ వాటర్ ప్లాంట్‌ను బహుకరించినట్లు తెలిపారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ కుసుమ సతీష్ మాట్లాడుతూ,పాఠశాల అభివృద్ధికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ…
విద్యార్థులపై ఉన్న మమకారంతో మంచినీటి ప్లాంట్ అందజేసిన అధ్యక్షురాలు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పెద్దబోయిన ఎల్లయ్య,మాజీ సర్పంచ్ పిండి విజయ బిక్షపతి,వార్డు సభ్యులు ఇట్టబోయిన రాజు, పేరెంట్స్ కమిటీ సలహాదారుడు నూకల కృష్ణ,గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
