రేరా అనుమతులు లేకుండా అసలే నిర్మాణాలు వద్దని, దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డా. పల్లె పాడు దామోదర్ రేరా చైర్మన్ యం. సత్యనారాయణ కు విన్నవించారు. మంగళవారం నాడు రేరా కార్యాలయంలో డా. పల్లె పాడు దామోదర్ తో పాటు వినియోగదారుల మండలి రాష్ట్ర అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి, సి.సి.ఐ. తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు మామిడి భీం రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అందె శ్రీ ధర్ రెడ్డి లు రేరా చైర్మన్ యం. సత్యనారాయణను కలిసి తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో అపార్ట్మెంట్ లు కొనుగోలు చేసిన వినియోగదారుల సమస్యలను తెలిపారు.
ఫ్లాట్ లు కొనుగోలు చేసిన వినియోగదారులకు సకాలంలో పూర్తి అయిన ఫ్లాట్ లను అప్పజెప్పక పోవడం, ఫ్రీ లాంచింగ్ పేరిట పెద్ద ఎత్తున అడ్వాన్స్ లను వసూలు చేసి వ్యాపారాలను మధ్యనే మూసి వేసి వినియోగదారులను మోసం చేయడం, వరంగల్ జిల్లాలో అనేక చోట్ల రేరా అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున నిర్మాణాలు, భద్రకాళీ చెరువు శిఖంలో అనుమతులు లేని అపార్ట్మెంట్ లు, నిజామాబాద్ జిల్లాల్లో రెల్వే లైన్ ఆనుకొని ఉన్న రైల్వే జోన్ భూముల్లో అపార్ట్మెంట్ లు, ఏవి అసైన్మెంట్ భూములు, ఏవి ప్రభుత్వ భూములు తెలియ కుండా అసంపూర్తి సమాచారం తో రియల్ ఎస్టేట్ వ్యాపారాల వల్ల వినియోగదారులు పెద్ద ఎత్తున మోసపోతున్నారని, వినియోగదారుల ప్రతినిధులు రేరా చైర్మన్ యం. సత్యనారాయణకు విన్నవించారు.
అనంతరం రేరా చైర్మన్ మాట్లాడుతూ, ప్రతీ అపార్ట్మెంట్ లో 15శాతం వినియోగదారుల హక్కుల పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం పేరిట మార్టిగేజ్ చేయడం జరిగుతుందని, కాబట్టి వినియోగదారులు తమకు ఎలాంటి సమస్య లు ఏర్పడినా రేరా కు ఫిర్యాదు చేస్తే, తగిన పరిహారం పొందడానికి అవకాశం ఉందని తెలిపారు.
అలాగే వినియోగదారులు ఫ్లాట్ లను కొనుగోలు చేసే ముందు ప్రాజెక్టు పూర్తి వివరాలను ఆయా వెబ్ సైట్ లో పరిశీలించుకొని, అధికారికంగా ప్రకటించిన బ్యాంక్ అకౌంట్ లకు ఫ్లాట్ ల ధర మొత్తం ను జమ చేసి నట్లయితే, వినియోగదారులకు రక్షణ ఉంటుందని వినియోగదారుల ప్రతినిధులకు సూచించారు. చైర్మన్ ను కలిసిన వారిలో సి.సి.ఐ. తెలంగాణా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యన్. ప్రవీణ, జన జాగృతి మహిళా విభాగం అధ్యక్షురాలు విప్లవ జ్యోతి లు కూడా ఉన్నారు..
