Monday, October 27, 2025
ePaper
Homeతెలంగాణదివిస్‌ షేర్‌ మరోసారి పతనం

దివిస్‌ షేర్‌ మరోసారి పతనం

  • రోజురోజుకు భారీగా దిగువకు
  • గత నెల రోజులలో భారీ కుదుపు
  • 6,100 నుండి 5836 వరకు తగ్గిన షేర్‌

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లోనే అతి భారీ ఫార్మా పరిశ్రమ దివిస్‌(DIVIS) ల్యాబ్స్‌ భారీగా ఎగుమతులు చేస్తూ ముందు భాగంలో ఉన్న దివిస్‌ ల్యాబ్స్‌ షేర్‌ మార్కెట్‌లో గత నెల రోజులుగా భారీగా ఒడిదుడుకులకు గురి అవుతుంది. ఇటీవల 6100 వరకు చేరిన షేర్‌ సుమారు 350 రూపాయలకు పైగా పడిపోయింది.. దాంతో షేర్‌ హోల్డర్లు ఆందోళనకు గురవుతున్నారు. దివిస్‌ షేర్‌ హోల్డర్ల భయపడుతున్నట్టే దివిస్‌ షేర్‌ గత 20 రోజులలో 300 రూపాయలకు పైగా పడిపోయింది.. గత నెల రోజులుగా షేర్‌ మార్కెట్‌ భారీగా పతనం అయింది. అదే బాటలో దివిస్‌ షేర్‌ రోజురోజుకు భారీగా పతనం కావడంతో షేర్‌ హోల్డర్లలో అధికంగా ఆ సంస్థ వారు ఉన్నందున దివిస్‌ సంస్థ నష్టనివారణ చర్యలు చేపడుతారని ఆశాభావంతో ఉన్నారు విదేశీ వాటాదారులు కూడా షేర్‌ హోల్డర్లు ఉన్నారు. విదేశీ ఎగుమతుల మీద ఆధారపడి ఉన్నందున నూతనంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ తీసుకుంటున్న చర్యల మూలంగా ప్రపంచ మార్కెట్లో హెచ్చు తగ్గులకు గురి అవుతున్నాయి. ఏది ఏమైనా దివిస్‌ ల్యాబ్స్‌ షేర్‌ రోజురోజుకు పడిపోతుండడం షేర్‌ హోల్డర్లను దివిస్‌ షేర్ల అమ్మకాలకు ఒత్తిడికి గురి చేసే అంశంగా కనిపిస్తుందని రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందో అని షేర్‌ హోల్డర్లు ఆలోచనలో పడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News