- జిల్లా కలెక్టర్ శ్రీమతి కే. హైమావతి
- డి ఎం అండ్ ఎచ్ ఓ కు ఆదేశాలు జారీ
- గర్భస్త ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయాలి
- ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండాలి
- ప్రభుత్వ ఆసుపత్రినీ ఆకస్మితంగా తనిఖీ
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోండి అని చరవాని ద్వారా డి ఎం అండ్ హెచ్ ఓ కు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ శ్రీమతి కె .హైమావతి.ఈ సందర్భంగా జగదేవపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మితంగా మంగళవారం రోజున తనిఖీలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సమయానికి విధుల్లో హాజరు కావాలని రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని గర్భస్థ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా ప్రతి ఒక్కరు పని చెయ్యాలని మెడికల్ ఆఫీసర్ మరియు సిబ్బంది ఎఎన్ఎం లను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆదేశించారు.
రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోపల అన్ని గదులు తనికి చేశారు. ఇప్పటివరకు ఎంత ఓపి చూశారని మెడికల్ ఆరా తీశారు. వైద్య పరికరాలు మందులు సమకూర్చుకుని రోగులకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. మెడికల్ ఆఫీసర్ నుండి కింది స్థాయి సిబ్బంది వరకు సమయవేళలు పాటిస్తూ విధులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.

ఆయా గ్రామాల్లోని గర్భస్థ మహిళల ఆరోగ్య స్థితి గతులను పర్యవేక్షణ చెయ్యాలని ప్రతి గర్భిణీ ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేసుకోవాలని ప్రైవేట్ ఆసుపత్రికి ఒక్క మహిళ కూడా వెళ్లకుండా పని చెయ్యాలని మెడికల్ ఆఫీసర్ మరియు ఏ ఎన్ ఎం లను ఆదేశించారు. అన్ని జిల్లా జనరల్ ఆసుపత్రులలో అన్ని సదుపాయాలు కల్పించాలని ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డాక్టర్ మరియు సిబ్బంది పైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా డి ఎం అండ్ ఎచ్ ఓ ను ఫోన్ ద్వారా ఆదేశించారు.
అనంతరం తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. జగదేవపూర్ గ్రామ సర్పంచ్ పని గట్ల శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలో ఉన్న నీటి ట్యాంక్ శిధిలావస్థకు చేరిందని నీటి నీ ఎక్కించడం లేదని దాని స్తానంలో కొత్తది నిర్మించాలని అంతే కాకుండా ఐఓసీ బిల్డింగ్ ని ప్రారంభించాలని కోరారు.
