ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, మధ్యాహ్నం 1:00 గంటలలోపు పోలింగ్ కేంద్ర ఆవరణంలో ఉన్న ప్రతి ఒక్కరికి టోకెన్లు జారీ చేసి ఓటు వేసే అవకాశం కల్పించాలని ఎన్నికల సిబ్బందిని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. ఆదివారం చివ్వెoల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, బండమీది చందుపట్ల లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు.

చివ్వెంల గ్రామ పంచాయతీలో 12 వార్డు లలో 2060 ఓట్లు ఉన్నాయని ఉదయం 10:15 గంటల వరకు 48 శాతం పోలింగ్ పూర్తి అయిందని అలాగే బండమీది చందుపట్ల గ్రామపంచాయతీలో 12 వార్డులలో 2529 ఓట్లు ఉన్నాయని ఉదయం 10:30 గంటలకు 60 శాతం పోలింగ్ పూర్తయిందని ఆర్ ఓ లు జి. వి. నరసింహారావు, ఎస్. కె షరీఫ్ కలెక్టర్ కు వివరించారు.
- Advertisement -
