Tuesday, February 10, 2026
Homeనల్లగొండCMRF | సీఎంఆర్ఎఫ్‌ చెక్కుల పంపిణీ

CMRF | సీఎంఆర్ఎఫ్‌ చెక్కుల పంపిణీ

నల్గొండ, నవంబర్ 14 (ఆదాబ్ హైదరాబాద్): పేదల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) అంకితభావంతో పనిచేస్తోందని తెలంగాణ శాసన మండలి (Assembly Council) చైర్మన్‌ (Chairman) గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhendar Reddy) అన్నారు. శుక్రవారం నల్గొండలోని తన క్యాంప్ ఆఫీసులో 40 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) పథకం ద్వారా మంజూరైన రూ. 15,20,500 విలువైన చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం (సీఎంఆర్ఎఫ్) ఎంతో ఉపయోగకరమైందని, ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఆరోగ్యపరంగా ఎంతో లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

​ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోందని, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News