Monday, January 19, 2026
EPAPER
Homeస్పోర్ట్స్Telangana T-20 | ప్రీమియర్ లీగ్ పాలక మండలిలో అనర్హులు

Telangana T-20 | ప్రీమియర్ లీగ్ పాలక మండలిలో అనర్హులు

  • బీసీసీఐకి ఫిర్యాదు చేసిన టీసీఏ
  • తగిన చర్యలు తీసుకోవాలని మనవి

హైదరాబాద్, జనవరి 17 (ఆదాబ్ హైదరాబాద్): తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Telangana Cricket Association) ప్రతిపాదిత తెలంగాణ టీ–20 ప్రీమియర్ లీగ్(Telangana T20 Premier League) కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) అక్రమంగా ప్రకటించిన పాలక మండలిని తక్షణమే రద్దు (Dismiss Governing Council immediately) చేయాలని కోరుతూ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI)కి అధికారిక ఫిర్యాదు సమర్పించింది.

హెచ్‌సీఏ ప్రకటన ప్రారంభం నుంచే చెల్లదని, ఇది సుప్రీంకోర్టు(Supreme Court) ఆమోదించిన బీసీసీఐ రాజ్యాంగాన్ని ఘోరంగా ఉల్లంఘించిందని, ఏజీఎం ఆమోదం లేకుండా, అలాగే బాంబే హైకోర్టులో డబ్ల్యూపీ నంబర్ 3678/2023, తెలంగాణ హైకోర్టులో డబ్ల్యూపీ నంబర్ 39837/2025 కేసులు పెండింగ్‌లో ఉండగానే ఈ ప్రకటన చేసినట్లు టీసీఏ స్పష్టం చేసింది.

- Advertisement -

హెచ్‌సీఏ ప్రకటించిన రాజ్యాంగపరంగా అనర్హుల వివరాలు

  1. బసవరాజ్–జాయింట్ సెక్రటరీ(తనంతట తానే సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు)
  • ఉల్లంఘనలు: రూల్స్ 14, 15 & 28(ఏజీఎం ఆమోదం లేదు, చెల్లుబాటయ్యే ఎపెక్స్ కౌన్సిల్ లేదు)
  • రూల్ 38: ప్రయోజనాల ఘర్షణ–యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్, ఇంటరిమ్ సీఈఓ ఇంతియాజ్ ఖాన్‌లతో ఒకే క్లబ్‌లో పదవులు
  • సీఐడీ ఎఫ్.ఐ.ఆర్. నంబర్ 02/2025 అరెస్టుల అనంతరం ఎపెక్స్ కౌన్సిల్‌కు క్వారం లేకపోవడం.
  1. సునీల్ అగర్వాల్–ఎపెక్స్ కౌన్సిల్ సభ్యుడు
  • రూల్ 38 ఉల్లంఘన: కుమారుడు హెచ్‌సీఏ అండర్–23 జట్టుకు ప్రాతినిధ్యం వహించడం (ప్రత్యక్ష ప్రయోజనాల ఘర్షణ)
  1. పార్థ సత్వలేకర్–అక్రమంగా నామినేట్ చేసిన ఎపెక్స్ కౌన్సిల్ సభ్యుడు
  • ఉల్లంఘనలు: రూల్స్ 14 & 15 (ఏజీఎం/ప్లేయర్స్ అసోసియేషన్ ఆమోదం లేదు)
  • రూల్ 38: కుమారుడు హెచ్‌సీఏ అండర్–19 జట్టుకు (కూచ్ బెహార్ ట్రోఫీ) ప్రాతినిధ్యం
  1. సంజీవ రెడ్డి–ఎపెక్స్ కౌన్సిల్ సభ్యుడు
  • ఎస్.ఎల్.పీ. నంబర్: 6779/2021లో హెచ్‌సీఏకి ప్రత్యర్థి కాగా హెచ్‌సీఏపై అనేక రిట్ పిటిషన్లలో పిటిషనర్
  • ఒకే వ్యక్తి పిటిషనర్‌గా ఉండి అదే సంస్థను పాలించడం మౌలికంగా చట్ట విరుద్ధం
  • సహజ న్యాయ సూత్రాలు, రూల్ 38 ఉల్లంఘన
  1. ఇంతియాజ్ ఖాన్–ఇంటరిమ్ సీఈఓ
  • రూల్ 47 ఉల్లంఘన: అర్హత లేదు, ఏజీఎం ఆమోదం లేదు, చట్టబద్ధంగా ఎన్నికైన ఎపెక్స్ కౌన్సిల్ ద్వారా రత్నీకరణ లేదు
  • రూల్ 38 : బసవరాజ్‌తో కలిసి అమీర్‌పేట్ క్రికెట్ క్లబ్‌లో పదవులు
  1. అగం రావు–జిల్లా ప్రతినిధి
  • పదవీ కాలం ముగిసినా అనుమానాస్పదంగా ఎన్నిక
  • రూల్ 38: లీగ్ మ్యాచ్‌లకు ప్రతిపాదిత గ్రౌండ్ యజమాని కావడం ద్వారా ఆర్థిక ప్రయోజనాల ఘర్షణ
  • ఎస్.ఎల్.పి. నంబర్ 6779/2021లో ప్రతివాది/ఇంప్లీడర్, జిల్లా నిధుల దుర్వినియోగం, అక్రమాలు, హెచ్‌సీఏతో సంబంధిత
    ఘర్షణల ఆరోపణలు

ప్రధాన రాజ్యాంగ ఉల్లంఘనలు

  • రూల్స్ 14 & 15: పాలక మండలి నియామకానికి ఏజీఎం ఆమోదం లేదు
  • రూల్ 28: అర్హత లేని సభ్యులతో అక్రమ పాలక మండలి ఏర్పాటు
  • రూల్ 38: సభ్యులందరిలోనూ బహుళ, ప్రత్యక్ష ప్రయోజనాల ఘర్షణలు
  • రూల్ 47: ఇంటరిమ్ సీఈఓ అక్రమ నియామకం

టీసీఏ ప్రకారం, ప్రకటించిన పాలక మండలి 100% అనర్హం. ఇది చట్టబద్ధ అధికారం లేని కుమ్మక్కైన గుంపు మాత్రమే. ఈ నిర్మాణంలో లీగ్‌కు అనుమతి ఇస్తే ప్రజా నిధులు, బీసీసీఐ/ఐపీఎల్ ప్రతిష్ఠ, గ్రామీణ క్రికెట్ తీవ్ర ప్రమాదంలో పడతాయని హెచ్చరించింది.

టీసీఏ డిమాండ్లు

బీసీసీఐ తక్షణమే ఈ పాలక మండలిని రద్దు చేయాలి. కోర్టు తీర్పులు వచ్చే వరకు హైదరాబాద్ నగరానికి బయట తెలంగాణ క్రికెట్‌లో హెచ్‌సీఏ జోక్యాన్ని నిలిపివేయాలి. నిరంతర రాజ్యాంగ ఉల్లంఘనలపై హెచ్‌సీఏపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.
సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ రాజ్యాంగానికి ఏ మినహాయింపులు లేవని, చర్యలు తీసుకోకపోతే తెలంగాణలో క్రికెట్ పరిపాలన విశ్వసనీయతకు తిరగరాని నష్టం జరుగుతుందని టీసీఏ స్పష్టం చేసింది. ఈ వివరాలను ధరం గురువారెడ్డి, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News