Wednesday, March 4, 2026
Homeసాహిత్యంAmaravathi Art | జనవరి 9న పుస్తకంతో చర్చ

Amaravathi Art | జనవరి 9న పుస్తకంతో చర్చ

నేటి తెలుగువారి పూర్వీకుల సృజనాత్మక ప్రతిభా ఉత్పత్తులు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు కృష్ణా నది వెంట అసాధారణంగా వెలుగొందాయి. మానవ చరిత్రలోనే అదొక అద్భుత సాంస్కృతిక కళాత్మక యుగం. బౌద్ధ శిల్పం చిత్రకళ చైత్య భవన నిర్మాణాలే కాకుండా మత సిద్ధాంతాలు, తత్వాలు, క్రతువుల రూపకల్పనలు, సాహిత్య, రాజకీయ, నైతిక రంగాల్లో అనేకానేక అన్వేషణలు ఉత్కృష్ట రీతిలో విలసిల్లిన కాల ప్రవాహం అది. దాన్ని అమరావతి కళా సంప్రదాయంగా అభివర్ణిస్తున్నారు.

కృష్ణా నది లోయ బౌద్ధం, అమరావతి కళా సంప్రదాయం వికసించి, విస్తరించి మన దేశమే కాకుండా శ్రీలంక, ఇంకా తూర్పు ఆసియాలోని అనేక ప్రాంతాల్లో చూపిన ప్రభావం, ఆ తీరుతెన్నుల గురించి అనేక కొత్త వివరాలు చరిత్రకారులు కనుక్కొని ఈ మధ్య కాలంలో ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఎంతో ఆసక్తికరంగా జన రంజక శైలిలో అమరావతి సంస్కృతికి సంబంధించిన రెండు గొప్ప తావులు.. ధరణి కోట, నాగార్జున కొండ.

- Advertisement -

ఒకటి 225 ఏళ్ల కిందట, రెండోది 100 ఏళ్ల కిందట ఎలా కనుగొన్నారు?. వాటి వివరాలు, కథలు, గాథలు, వృత్తాంతాలను ఫోటోలు, చారిత్రాత్మక రేఖా చిత్రాలు, భౌగోళిక పటాలతో అందరికీ బోధపడేలా పున్నా కృష్ణమూర్తి(Punna Krishnamaurty) ఈ పుస్తకంలో సమకూర్చిపెట్టారు. అమరావతి ఆర్ట్(Amaravathi Art) అనే పుస్తకంతో చర్చ(Book Discussion)ను ఈ నెల 9న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్-1 జీవీకే మాల్ దగ్గర లమకాన్‌(Lamakaan)లో నిర్వహిస్తున్నారు. మరువం సమర్పణలో మరువం(Maruvam) చర్చా వేదిక(Discussion Forum) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News