రంగుల్ని (Colors) వెదజల్లుతుంది
పొంగుల్ని పూయిస్తుంది
కలలను (Dreams) ముస్తాబు చేస్తుంది
మౌనం బద్ధలు కొడుతుంది
హృదయానికి వల వేసి
గుండెను ఆక్రమిస్తుంది
రంగుల కాగితాలతో
బతుకును (Life) అలంకరిస్తుంది
నమ్మికతో ఆట్లాడుకొని
ఆశలకు ఆయువు పోస్తుంది
కమ్మగా కనిపిస్తూనే
కొత్త పుంతలు తొక్కుతుంది
తీయని (Sweet) పలకరింపులతో
మైమరపిస్తుంది
వెచ్చని ఊహల్ని రప్పించి
మురిపించి మరిపిస్తుంది
ఒట్టి మాటల మూటలతో
గట్టిగా హత్తుకుంటుంది
చక్కగా కుదిరిందనుకోగానే
కుంపటి రగిలిస్తుంది
- నరెద్దుల రాజారెడ్డి
- Advertisement -
