Tuesday, March 24, 2026
Homeఆరోగ్యంDiabetes | డయాబెటిస్ పేషంట్లు వ్యాయామం చేయాలి..

Diabetes | డయాబెటిస్ పేషంట్లు వ్యాయామం చేయాలి..

  • ఇది తప్పనిసరి అని సూచిస్తున్న నిపుణులు..
  • నిర్లక్ష్యం చేస్తే ఎంతో ప్రమాదం అని హెచ్చరిక..

అధిక రక్త చక్కెర స్థాయిలు, అంటే హైపర్ గ్లైకో, ఆరోగ్యానికి అనుకున్నదానికంటే ఎక్కువ ప్రమాదకరమ‌ని వైద్యులు చెబుతున్నారు. దీన్ని నియంత్రించకుండా వదిలేస్తే తక్షణ సమస్యలతో పాటు దీర్ఘకాలిక దుష్ప్రభావాలు కూడా ఎదురవుతాయి. సాధారణంగా డ‌యాబెటిస్ తో సంబంధం ఉన్న ఈ పరిస్థితి వల్ల ఎక్కువ దాహం, తరచుగా మూత్ర విసర్జన, అలసట, చూపు మసకబారడం, తలనొప్పి, నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలంగా రక్తంలో చక్కెర అధికంగా ఉంటే అది శరీరంలోని రక్తనాళాలు, నరాలను క్రమంగా దెబ్బతీస్తుంది.

ఫలితంగా కిడ్నీ సమస్యలు, నరాల నష్టం, చూపు కోల్పోవడం, పాద సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వీటితో పాటు రక్త చక్కెర స్థాయిలు వ్యాయామ పనితీరుపై కూడా ప్రభావం చూపుతాయి. వ్యాయామ సమయంలో అధిక చక్కెర స్థాయిలు శారీరకంగా, మానసికంగా పనితీరును తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News