Monday, October 27, 2025
ePaper
Homeహైదరాబాద్‌DGP | డీసీపీ, గన్‌మెన్‌లకు డీజీపీ పరామర్శ

DGP | డీసీపీ, గన్‌మెన్‌లకు డీజీపీ పరామర్శ

తెలంగాణ రాష్ట్ర డీజీపీ (Dgp) బి. శివధర్ రెడ్డి ఐపీఎస్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (Sajjanar) ఐపీఎస్.. చాదర్‌ఘాట్‌లోని విక్టోరియా గ్రౌండ్‌ వద్ద జరిగిన సంఘటనలో గాయపడిన సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎస్. చైతన్య కుమార్ ఐపీఎస్, ఆయన అంగరక్షకుడు (గన్‌మెన్) మూర్తిని యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. వారి ధైర్యసాహసాలను అభినందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డిజిపి బి. శివధర్ రెడ్డి ఐపీఎస్ మీడియా తో మాట్లాడుతూ చాదర్‌ఘాట్ ప్రాంతంలో మొబైల్ స్నాచర్లపై కాల్పులు జరిగాయి. సెల్ ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితులను పట్టుకునే క్రమంలో, నిందితులు డీసీపీపై కత్తితో దాడి చేశారు.డీసీపీ చైతన్య కుమార్ మరియు గన్‌మెన్(Gunman) మూర్తి నిందితులను సుమారు 750 మీటర్లు వెంబడించారు.

ఆ సమయంలో నిందితులు కత్తితో దాడికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు ఒమర్ అన్సారీ పై గతంలో 22 కేసులు నమోదై ఉన్నాయి.కాలపత్తర్ పోలీస్ స్టేషన్‌లో ఒమర్ అన్సారీపై రౌడీ షీట్ ఉంది.ఈ ఆపరేషన్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన డీసీపీ, గన్‌మెన్ల ఆరోగ్య పరిస్థితి గురించితెలుసుకున్నాము.ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.గాయపడిన ఇద్దరు అధికారులు రేపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు.పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నాము.నిందితుడు ఒమర్ అన్సారీకి శస్త్రచికిత్స (ఆపరేషన్) జరిగింది. నిందితుడి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది.

కమిషనర్ ఆఫ్ పోలీసు వి.సి. సజ్జనార్ ఐపీఎస్ మీడియా తో మాట్లాడుతూ డీసీపీ సౌత్ జోన్ నేతృత్వంలో పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ మరియు మరో నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి.దర్యాప్తులో కొన్ని క్లూస్ కూడా లభించాయి. ఇటీవల ఒమర్ అన్సారీ యొక్క కదలికలు మరియు అతనికి ఉన్న పరిచయాలపై వివరాలు సేకరిస్తున్నాము.నగరంలో విజిబుల్ పోలీసింగ్ (Visible Policing) ను పెంచాము.ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హైద్రాబాద్ పోలీసులు ఎల్లప్పుడూ మీకు రక్షణగా ఉంటారు. రౌడీ షీటర్లు, దొంగల పట్ల కఠిన చర్యలు తీసుకుంటాము.

మొబైల్ స్నాచింగ్ గ్యాంగ్స్ పై కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టాము.డీసీపీ చైతన్య కుమార్‌కు మెడ భాగంలో గాయాలయ్యాయి, గన్‌మెన్ మూర్తికి కాలు గాయమైంది.ఈ సంఘటనలో డ్రైవర్ సందీప్ అప్రమత్తంగా ఉండి, కీలక పాత్ర పోషించారు.డీసీపీ చైతన్య కుమార్, గన్‌మెన్ మూర్తి, డ్రైవర్ సందీప్ – ముగ్గురూ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం ఐదు బృందాలు గాలిస్తున్నాయి. చింతమనేని శ్రీనివాస్ ఐపీఎస్ (డీసీపీ వెస్ట్ జోన్), స్నేహా మెహ్రా ఐపీఎస్ (డీసీపీ సౌత్ జోన్) మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News