మారేడ్పల్లి మండల పరిధిలోని అడ్డగుట్ట బాబు జగ్జీవన్ రామ్ భవనంలో మంగళవారంనాడు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో విద్యకు 20 శాతం నిధులు కేటాయించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక,తల్లుల సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్–2024 నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం దేశంలో 35వ స్థానంలో నిలిచిందని పేర్కొంటూ,ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించడంలో విఫలమైందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో విద్యకు 15% బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని అమలు చేయలేదని విమర్శించారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత,ఉపాధ్యాయుల లోపం,ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ లేకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం.వి. ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఎ.వి.ఎం.స్వామి,సిఆర్పిఎఫ్ జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మీనారాయణ,జిల్లా కో-కన్వీనర్ పి. రమాదేవి,తల్లుల సంఘం జిల్లా కో-కన్వీనర్ ఎన్. శోభ,సిఆర్పిఎఫ్ మండల కన్వీనర్ పి.ఎల్.ప్రవీణ్,ఆర్. మల్లేష్,కాంపల్లి శ్రీనివాస్,రామలీల,గోపి,గోవిందరాజ్విజయ్ రోహిత్,ఉమర్ ఎం.వి. ఫౌండేషన్ ఆర్గనైజర్లు ఎ.సువర్ణ,ఆర్.సుమలత, లావణ్య పాల్గొన్నారు.
