Saturday, October 4, 2025
ePaper
Homeసినిమాఐశ్వర్య ఫోటోలు వాడడానికి లేదు

ఐశ్వర్య ఫోటోలు వాడడానికి లేదు

వాడితే కఠిన చర్యలు తప్పవన్న కోర్టు

ఇకపై ఐశ్వర్య అనుమతి లేకుండా ఆమె ఫొటోలు వాడడానికి వీల్లేదని న్యాయస్థానం ఆదేశించింది. ఐశ్వర్య ఫొటోలు దుర్వినియోగం చేయడం వల్ల ఆమెకు ఆర్థికంగా నష్టం కలిగించడమే కాకుండా ఆమె గౌరవం, ప్రతిష్ఠ ను దెబ్బతీసినట్లేనని కోర్టు పేర్కొంది. ఈమేరకు ఆమె ప్రచార, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా విడితే కఠిన చర్యలు తప్పవని ఢల్లీి హైకోర్టు హెచ్చరించింది. అనుమతి లేకుండా తన ఫొటోలు వాడుతున్నారంటూ ఇటీవల నటి ఐశ్వర్యారాయ్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో గురువారం న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఐశ్వర్య పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. అందులో గుర్తించిన యూఆర్‌ఎల్‌లను తొలగించి బ్లాక్‌ చేయాలని ఇ-కామర్స్‌ వైబ్‌సైట్‌లను, గూగుల్‌ సహా ఇతర ఎª`లాట్‌ఫార్మ్‌లను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. నోటీసులు అందిన 72 గంటల్లోపు పిటిషన్‌లో ఐశ్వర్య పేర్కొన్న యూఆర్‌ఎల్‌ బ్లాక్‌ చేయాలని పేర్కొంది. ఆ యూఆర్‌ఎల్స్‌ను ఏడు రోజుల్లో బ్లాక్‌ చేసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఐటీ, సమాచార శాఖకు కోర్టు సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 15న జరగనుంది. ఇక ఇదే విషయంపై ఐశ్వర్య భర్త, నటు-డు అభిషేక్‌ బచ్చన్‌ కూడా దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -

Latest News