Monday, October 27, 2025
ePaper
HomeసినిమాDEEPIKA PADUKONE | ఆన్ లైన్ పాపులారిటీలో తగ్గేదే లేదంటున్నా తార..

DEEPIKA PADUKONE | ఆన్ లైన్ పాపులారిటీలో తగ్గేదే లేదంటున్నా తార..

సాధారణంగా భారతీయ చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ పురుషాధిపత్యమే నడుస్తోంది. అగ్ర నటీనటుల పారితోషికాల విషయంలోనైనా, వారి కోసం రాసే పాత్రల విషయంలోనూ పురుషులే టాప్‌లో ఉంటారు. అయితే ఆన్ లైన్ పాపులారిటీ విషయంలో మాత్రం కొంతమంది అగ్ర తారలు అత్యంత పెద్ద సూపర్ స్టార్లను కూడా అధిగమిస్తూ దూసుకెళ్తున్నారు. ఇంటర్నెట్లో పాపులారిటీ విషయానికి వస్తే, దీపికా పదుకొణె ఇప్పుడు అందరికంటే ముందున్నారు. ఇటీవల ఐఎమ్‌డీబీ విడుదల చేసిన ’25 ఏళ్ల భారతీయ సినిమా’ నివేదిక (2000-2025)లో గత దశాబ్ద కాలంలో (జనవరి 2014 నుండి ఏప్రిల్ 2024 వరకు) ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయ నటుల జాబితాలో దీపికా పదుకొణె అగ్రస్థానంలో నిలిచింది.

ప్రతి నెలా ఐఎమ్‌డీబీని సందర్శించే 250 మిలియన్ల వినియోగదారుల పేజీ వీక్షణల ఆధారంగా రూపొందించిన ఈ ‘మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ ది లాస్ట్ డికేడ్’ జాబితాలో దీపికా, తన సహనటుడు షారుఖ్ ఖాన్ను సైతం అధిగమించడం పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ జాబితాలో ముగ్గురు అగ్ర ఖాన్లు (షారుఖ్, అమీర్, సల్మాన్ ), అలాగే రాజనీకాంత్ వంటి అగ్ర నటులు ఉన్నప్పటికీ, వారి కంటే ఒక మహిళా స్టార్ ముందు నిలబడటం విశేషం. టాప్ 5లో ఐశ్వర్య రాయ్, ఆలియా భట్ వంటి మరో ఇద్దరు మహిళా తారలు ఉన్నారు. టాప్ 10లో బాలీవుడ్ అగ్ర తారలు అమీర్ ఖాన్ (6), సల్మాన్ ఖాన్ (8), హృతిక్ రోషన్ (9), అక్షయ్ కుమార్ (10) ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News