ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 29న దీక్షా దివస్ (Deeksha Diwas) మహాకార్యక్రమం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం BRS పార్టీ అధినేత KCR చేపట్టిన దీక్షా దివస్ కార్యక్రమానికి గుర్తుగా దీన్ని ఏర్పాటుచేశారు. ఆర్ట్స్ కాలేజీ (Arts College) వేదికగా నిర్వహించే ఈ దీక్షా దివస్ మహా కార్యక్రమనికి విద్యార్థులు వేలాదిగా తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి అనుమతించాలని, సహకరించాలని కోరుతూ BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపెల్లి నరేష్ ఓయూ పోలీస్ స్టేషన్ SHOకి వినతిపత్రం సమర్పించారు. ఓయూ BRSV సురేష్, సదానందం, పవన్, ప్రవీణ్ తదితర నాయకులు ఇందులో పాల్గొన్నారు.
- Advertisement -
