Monday, April 13, 2026
Homeబిజినెస్Gemstones | తగ్గిన రత్నాభరణాల ఎగుమతులు

Gemstones | తగ్గిన రత్నాభరణాల ఎగుమతులు

గతేడాది అక్టోబర్‌తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్‌లో రత్నాలు, ఆభరణాల స్థూల ఎగుమతులు (Gross Exports) 30 శాతానికి పైగా తగ్గాయి. ప్రపంచంలోని ప్రధాన మార్కెట్ల (Major Markets) నుంచి ఆర్డర్లు (Orders) పడిపోయాయి. ఈ మేరకు జెమ్స్ అండ్ జ్యూలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్.. గణాంకాలను విడుదల చేసింది. పోయినేడాది అక్టోబర్‌లో రత్నాలు, ఆభరణాల స్థూల ఎగుమతుల విలువ 3,122.52 మిలియన్ డాలర్లు కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో 2,168.05 మిలియన్ డాలర్లకు తగ్గాయి. కట్ అండ్ పాలిష్డ్ డైమండ్ల (Diamonds) ఎక్స్‌పోర్ట్‌లు 27 శాతం మైనస్ అయ్యాయి.

తద్వారా.. 1025.99 మిలియన్ డాలర్లకు డౌన్ అయ్యాయి. ల్యాబ్‌(Lab)లో తయారుచేసే పాలిష్డ్ డైమండ్ల పరిస్థితీ ఇలాగే ఉంది. వీటి ఎగుమతులు కూడా 34.90 శాతం క్షీణించాయి. బంగారు ఆభరణాల (Gold Ornaments) ఎగుమతులు 24.61 శాతం తగ్గిపోయి 850.15 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కిందటేడాది ఇదే సమయంలో 1,187.34 మిలియన్ డాలర్ల విలువైన ఎక్స్‌పోర్ట్‌లు జరిగాయి. ఎగుమతులు నేలచూపులు చూడటానికి కారణం అమెరికా, యూరప్, చైనా తదితర మేజర్ మార్కెట్లలో డిమాండ్ లేకపోవటం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News