Homeక్రైమ్ వార్తలుDemand For Punishment | కుమారుడి మృతి కారకులను శిక్షించాలి

Demand For Punishment | కుమారుడి మృతి కారకులను శిక్షించాలి

కేసును రీఓపెన్ చేయాలి
తల్లిదండ్రుల డిమాండ్..
జ్యూలరీ షాపు వద్ద ఆందోళన

తమ కుమారుడి (Son) మృతి (Death)కి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని అతని తల్లిదండ్రులు (Parents) డిమాండ్ (Demand) చేశారు. ఈ మేరకు రామంతాపూర్‌లోని ఓ జ్యూలరీ షాపు (Jewelry shop) ముందు ఆందోళనకు దిగారు. షాపు యజమాని, అతని కుటుంబ సభ్యులే నిందితులని, వారిపై నమోదైన కేసును రీఓపెన్ (Reopen) చేయాలని కోరారు. బాధితులను ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కి తరలించి కౌన్సెలింగ్ (Counseling) ఇవ్వటంతో వివాదం సద్దుమణిగింది.

- Advertisement -
death2

కేసు వివరాలు ఇలా ఉన్నాయి..

మహశ్విన్ కొండిశెట్టి అనే 18 ఏళ్ల యువకుడు ఈ ఏడాది సెప్టెంబర్ 21న ములుగు జిల్లా కొంగల సమీపంలోని జలపాతంలో పడి చనిపోయాడు. దీంతో.. అతని తండ్రి గణేష్.. వాజేడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహశ్విన్ కొండిశెట్టి స్నేహితులపై కేసు నమోదు చేయాలని కోరారు. కుమారుడిని తమకు తెలియకుండా మాయమాటలు చెప్పి, కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని, మృతికి వాళ్లే కారణమని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. ఇది జరిగి రెండు నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పైగా కేసును క్లోజ్ చేశారని వెంకట నాగసాయి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ జ్యూలరీ షాపు వద్ద ఆందోళన చేపట్టడంతో పోలీసులు వచ్చి సర్దిచెప్పారు. వాజేడు పోలీస్ స్టేషన్‌కే వెళ్లాలని సూచించడంతో శాంతించారు.

death3
- Advertisement -
RELATED ARTICLES

Latest News